'నా కూతురు చనిపోగానే బతకాలనిపించలేదు' | Bob Geldof reveals he considered suicide after his daughter Peaches died from a drugs overdose two years ago | Sakshi
Sakshi News home page

'నా కూతురు చనిపోగానే బతకాలనిపించలేదు'

Mar 29 2016 8:59 AM | Updated on Nov 6 2018 7:56 PM

'నా కూతురు చనిపోగానే బతకాలనిపించలేదు' - Sakshi

'నా కూతురు చనిపోగానే బతకాలనిపించలేదు'

తన కూతురు చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ హాలీవుడ్ సింగర్ బాబ్ గెల్డాఫ్ తెలిపారు.

లండన్: తన కూతురు చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ హాలీవుడ్ సింగర్ బాబ్ గెల్డాఫ్ తెలిపారు. ఓ టీవీ చానెల్తో మాట్లాడిన ఆయన తన కూతురు చనిపోవడం పట్ల తీవ్ర మదనపడ్డారు. 2014లో తన కూతురు పీచెస్ విపరీతంగా మత్తుపదార్థాలు సేవించి ప్రాణాలు విడిచిందని, ఆమె ప్రవర్తనను ముందుగా అంచనా వేయకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు.

ఆమె చనిపోయిన తర్వాత తనకు ఏం చేయాలో పాలుపోలేదని, ఒక రకమైన ఒత్తిడిలోకి పోయానని, అయితే, బతికి ఉండటానికి గల కారణాలు, చనిపోవడానికి కారణాలు ఒక జాబితాగా చేసుకొని పదే పదేవాటిని చూసుకున్నానని చెప్పారు. తన నిర్ణయంపట్ల మరో స్నేహితుడు చెంపదెబ్బ కొట్టినంతగా మాటలు అనండంతో ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనను తండ్రిగా విఫలమయ్యానని అంటుంటే ఎంతో బాధ కలిగిందని, అది కూడా నిజమే అన్నట్లుగా అనిపించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement