తాగిన మైకంలో టీవీ స్టార్ గర్ల్‌ఫ్రెండ్‌ వీరంగం | Blac Chyna arrested at airport for being drunk, fighting | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో టీవీ స్టార్ గర్ల్‌ఫ్రెండ్‌ వీరంగం

Jan 30 2016 11:42 AM | Updated on Aug 30 2018 5:27 PM

తాగిన మైకంలో టీవీ స్టార్ గర్ల్‌ఫ్రెండ్‌ వీరంగం - Sakshi

తాగిన మైకంలో టీవీ స్టార్ గర్ల్‌ఫ్రెండ్‌ వీరంగం

తాగిన మత్తులో ఓ మోడల్‌ విమానంలో వీరంగం వేసింది. తోటి ప్రయాణికులతో బాహబాహీకి దిగి పెద్ద గలాటా సృష్టించింది.

లాస్‌ ఏంజిల్స్‌: తాగిన మత్తులో ఓ మోడల్‌ విమానంలో వీరంగం వేసింది. తోటి ప్రయాణికులతో బాహబాహీకి దిగి పెద్ద గలాటా సృష్టించింది. దీంతో విమానం ల్యాండ్‌ అవ్వడమే ఆలస్యం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ హాలీవుడ్ టీవీ స్టార్ రాబ్ కర్దాషియన్‌ ప్రియురాలు బ్లక్ సినాను ఆస్టిన్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. మోడల్‌ అయిన ఈ అమ్మడు డెల్టా విమానంలో లాక్స్ నుంచి లండన్ వరకు ఆస్టిన్ మీదుగా ప్రయాణమైంది.

అయితే, అప్పటికే తాగిన మత్తులో తూలుతున్న సినా విమానంలో పెద్ద గలాటా సృష్టించింది. మత్తులో జోగుతూ ఆమె యుద్ధం లాంటి వాతావరణాన్ని విమానంలో సృష్టించిందని, దీంతో ఆమెను అరెస్టుచేసి జైలుకు పంపించామని ఆస్టిన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 27 ఏళ్ల ఈ మోడల్‌పై మద్యం మత్తులో గలాటా సృష్టించినట్టు ప్రస్తుతం అభియోగం మోపామని, మున్ముందు మరిన్ని  అభియోగాలు మోపే అవకాశముందని తెలిపారు. ఆమెను అరెస్టుచేస్తున్న సందర్భంగా ఎయిర్‌పోర్ట్ సిబ్బందిపైనా ఆమె కేకలు వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement