నా కెరీర్ నాశనమైంది : నటి

bisexual term destroy my career, says Amber Heard - Sakshi

లాస్ ఏంజెలిస్ : తన గురించి ఓ మేగజైన్‌లో వచ్చిన కథనంతో తన జీవితం తలకిందులైందనట్లు అనిపించిందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్(31) అన్నారు. బై సెక్సువల్ అని కవర్ స్టోరీ రావడంతో అందరికీ ఈ విషయం తెలిసిపోయిందని, అప్పటినుంచి తన సినీ కెరీర్ నాశనమైందన్నారు. జీవన విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనను హెచ్చరించినట్లు ఆమె తెలిపారు.

'నికోలస్ కేజ్, జానీ డెప్ సరసన నటించాను. ఆ సమయంలో నేనేలా ప్రవర్తించానో అందరికీ తెలుసు. కానీ కొందరు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుంది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అయినా మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శణం. మనుషులం అయినందుకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని' నటి అంబర్ హియర్డ్ అభిప్రాయపడ్డారు. ఆమె లేటెస్ట్ మూవీ 'జస్టిస్ లీగ్' ఈ 16న విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top