వెండితెరపై మల్లీశ్వరీ, కలాం జీవిత కథలు | Biopic on APJ Abdul Kalam, Karanam Malleswari | Sakshi
Sakshi News home page

వెండితెరపై మల్లీశ్వరీ, కలాం జీవిత కథలు

Dec 15 2016 12:47 PM | Updated on Aug 20 2018 3:02 PM

వెండితెరపై మల్లీశ్వరీ, కలాం జీవిత కథలు - Sakshi

వెండితెరపై మల్లీశ్వరీ, కలాం జీవిత కథలు

ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారులు, ఫిలిం స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా తమదైన ముద్ర వేసిన ప్రతీ ఒక్కరి జీవితాన్ని వెండితెర మీద చూపించేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారులు, ఫిలిం స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా తమదైన ముద్ర వేసిన ప్రతీ ఒక్కరి జీవితాన్ని వెండితెర మీద చూపించేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి మరో ఇద్దరు ప్రముఖుల జీవితాలు చేరేందుకు రెడీ అవుతున్నాయి. ఆ ఇద్దరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది ప్రముఖులు కావటం మరో విశేషం.

ఇప్పటికే ఒలింపిక్ విజేత మేరీకొమ్ బయోపిక్ తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖులు, వెయిట్ లిఫ్టర్గా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లీశ్వరీ జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగమ్మాయి సంజన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు నిర్మాత అనీల్ సుంకర కూడా బయోపిక్ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.

భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితకథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ అబ్దుల్ కలాం అనే టైటిల్ను రిజిస్టర్ చేసిన నిర్మాతలు ఈ సినిమాను పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement