తప్పుకోలేదు! | Bigg Boss star Oviya is still part of Kanchana 3 | Sakshi
Sakshi News home page

తప్పుకోలేదు!

Dec 10 2017 12:58 AM | Updated on Dec 10 2017 12:58 AM

Bigg Boss star Oviya is still part of Kanchana 3 - Sakshi

ఓవియా తప్పుకోలేదు. వచ్చిన వార్తలే తప్పు అంటున్నారు ‘కాంచన–3’ చిత్రబృందం. ఓవియా గురించి ఈ చిత్రబృందం ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే..  ఏవో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆమె ఈ హారర్‌ మూవీ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. సినిమా సగం పూర్తయింది. ఇప్పుడు హీరోయిన్‌ తప్పుకుందనే వార్త అంటే అనవసరమైన రచ్చే కదా. అందుకే, ‘నో నో.. ఓవియా ఈజ్‌ దేర్‌’ అన్నారు. హారర్‌ సినిమాల మాంత్రికుడు రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమా ‘కాంచన–3’.

లారెన్స్, ఓవియా, వేదిక కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ 55 పర్సెంట్‌ కంప్లీట్‌ అయ్యింది.  ఇంతకీ ఈ ఓవియా ఎవరంటే.. తరుణ్‌ హీరోగా నటించిన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తనే కథానాయిక.  అలాగే వేదిక తెలుగులో బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి చిత్రాల్లో నటించారు. 2006లో వచ్చిన ‘ముని’ ఫ్రాంచైజీ తొలి పార్ట్‌లో తనే కథానాయిక. మళ్లీ ఈ పార్ట్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో నైట్‌ షూట్‌ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement