బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

Bigg Boss 3 Tamil Winner Is Mugen Rao, Runner-Up Sandy Master - Sakshi

ఎన్నో వివాదాలకు వేదికగా నిలిచిన తమిళ బిగ్‌బాస్‌ 3 షో ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే! ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన ముగేన్‌రావ్‌ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. అతను టైటిల్‌ గెలిచి నాలుగు రోజులు కావస్తున్నా అతనికి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంటి సభ్యురాలు, స్నేహితురాలైన అభిరామి వెంకటాచలం అతనికి మళ్లీ శుభాకాంక్షలు చెప్తూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

ఆది నుంచి విమర్శలే!
బిగ్‌బాస్‌ తమిళ్‌ 3 సీజన్‌ జూన్‌ 23న ప్రారంభమైంది. మొదటినుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమల్‌ హాసన్‌పై కూడా ఒకానొక సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంటి సభ్యుడు శరవణన్‌ అసభ్యకరంగా మాట్లాడినందుకు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపారు. హౌస్‌లో తమిళ నటి మధుమిత ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి సభ్యుల వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆమె వెల్లడించడం గమనార్హం. ఇన్ని వివాదాల నడుమ ఎట్టకేలకు బిగ్‌బాస్‌ 3 సీజన్‌ సెప్టెంబర్‌ 6న ముగిసింది. 

సింగర్‌.. విన్నర్‌గా మారాడు!
తమిళ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న మలేషియన్‌ సింగర్‌ ముగేన్‌రావ్‌ బిగ్‌బాస్‌3 విజేతగా నిలిచాడు. విన్నర్‌ ముగేన్‌ రావ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌తోపాటు, రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సాండీ మాస్టర్‌ రన్నరప్‌గా నిలిచాడు. చివరగా ఫైనల్‌లో ముగేన్‌ రావ్‌ తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా కొరియోగ్రాఫర్‌ అయిన సాండీ డాన్స్‌ చేసి అదుర్స్‌ అనిపించాడు. ఇక ఈ సీజన్‌లో పాల్గొన్న 15మంది కంటెస్టెంట్లకు కమల్‌ హాసన్‌ అవార్డులు ప్రకటించాడు. ఈ సీజన్‌లో మొత్తంగా 200 కోట్ల పైచిలుకు ఓట్లు పోలయ్యాయని బిగ్‌బాస్‌ నిర్వాహకులు తెలిపారు. కేవలం ఫైనల్‌లోనే 20 కోట్లు వచ్చాయన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top