బిగ్‌బాస్-2 న‌టికి మళ్లీ అనారోగ్యం | Bigg Boss 2 contestant Sambhavna Seth unwell rushed to hospital | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌-2 కంటెస్టెంట్ అనారోగ్యం..హాస్పిట‌ల్‌లో

May 6 2020 2:42 PM | Updated on May 6 2020 4:07 PM

Bigg Boss 2 contestant Sambhavna Seth unwell rushed to hospital - Sakshi

హిందీ బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌, ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌, న‌టి సంభావ‌నా సేథ్ అనారోగ్యానికి గుర‌య్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ఆమె భ‌ర్త అవినాష్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. మే 4 న అనారోగ్యం కార‌ణంగా సంభావ‌నను ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, ఈరోజు డిశ్చార్జ్ కావ‌డంతో ఇంటికి తీసుకువ‌చ్చా. కానీ మ‌ళ్లీ ఆరోగ్యం క్షీణించ‌డంతో వెంటనే హాస్పిట‌ల్‌కి త‌ర‌లించాం. అని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌-2 తో పాటు బిగ్‌బాస్‌-8లోనూ పాల్గొన్న సంభావ‌నా అనేక మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. ప్ర‌ముఖ డాన్స‌ర్‌గా వెలుగొందుతూనే సంభావ‌నా సేథ్ ఎంట‌ర్టైన్‌మెంట్ అనే యూట్యూబ్ ఛానెల్‌నూ నిర్వ‌హిస్తుంది. ప్ర‌స్తుతం సంభావ‌నా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతుంది. అయితే అనారోగ్యానికి గ‌ల కార‌ణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement