ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు: బిగ్ బి | Big B congratulates DiCaprio for his debut Oscar win | Sakshi
Sakshi News home page

ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు: బిగ్ బి

Mar 1 2016 4:32 PM | Updated on Sep 3 2017 6:46 PM

ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు: బిగ్ బి

ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు: బిగ్ బి

ఆస్కార్ అవార్డు గెల్చుకున్న హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో(41)కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అభినందనలు తెలిపారు.

ముంబై: ఆస్కార్ అవార్డు గెల్చుకున్న హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో(41)కు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అభినందనలు తెలిపారు. డికాప్రియోకు కంగ్రాట్స్ చెప్తూ బిగ్‌ బి ట్వీట్ చేశారు. ‘ద రెవనెంట్’ చిత్రానికి గానూ డికాప్రియో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.

'ఆస్కార్ అవార్డు అందుకున్న నా సహ నటుడు, జంటిల్‌మెన్ లియోనార్డోకు శుభాకాంక్షలు. ఈ అవార్డు తీసుకునేందుకు అన్ని విధాల అర్హుడివి’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. 2013లో రిలీజైన ‘ద గ్రేట్ గేట్స్‌బై’ చిత్రంలో డికాప్రియోతో కలిసి అమితాబ్ నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement