మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు! | Bieber wants to cover up the tattoo tribute to Selena Gomez | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!

Feb 17 2016 9:08 AM | Updated on Sep 3 2017 5:50 PM

మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!

మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!

ఆయన ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కిపైగా పచ్చబోట్లు ఉన్నాయి.

లండన్‌: ఆయన ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కిపైగా పచ్చబోట్లు ఉన్నాయి. దేహం నిండా ఉన్న ఆ పచ్చబోట్లతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఓ టాటూను చూసి మాత్రం పాప్‌ స్టార్ జస్టిన్ బీబర్ తెగ ఇదయిపోతున్నాడు. ఆ టాటూ ఎవరికంట పడకుండా దాచాలనుకుంటున్నాడు. ఇంకుతో కవర్ చేసి.. ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకూ ఆ బొమ్మ ఎవరిదంటే సింగర్ సెలెనా గోమెజ్‌ది. ఈ ఇద్దరు ఒకప్పుడు గాఢమైన ప్రేమికులు. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు బ్రేకప్‌ అయింది. అప్పట్లో ప్రేమగా తన చేతిపై పచ్చపొడుచుకున్న ఆ ముద్దుగుమ్మ బొమ్మను ఇప్పుడు చెరిపేయాలని బీబర్ భావిస్తున్నాడు.

మాజీ ప్రియురాలి టాటూను కనిపించకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు 21 ఏళ్ల బీబర్ చెప్పాడు. ఈ బొమ్మను ఇంకుతో కప్పివేయడానికి ప్రయత్నించానని, అయినా ప్రజలు ఈ పచ్చబొట్టు ఎవరిదో గుర్తుపడుతున్నారని అతను చెప్పాడు. 'వాట్‌ డూ యూ మీన్‌' ఆల్బంతో తాజాగా హిట్ కొట్టిన ఈ యువ సంచలనం ఇప్పుడు హేలీ బల్ద్విన్‌తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రణయ సల్లాపాల్లో మునిగి తేలుతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు  సింగర్ సెలెనా గోమెజ్ మాత్రం ఒంటరిగా గడుపుతూ.. తన స్నేహితురాళ్లతో వాలెంటైన్స్ డే జరుపుకున్నదట.


 

Advertisement
 
Advertisement
Advertisement