కెమిస్ట్రీ అదిరింది! | Bhale Bhale Magadivoy Movie Shooting In Progress | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ అదిరింది!

Jul 28 2015 11:14 PM | Updated on Sep 3 2017 6:20 AM

కెమిస్ట్రీ అదిరింది!

కెమిస్ట్రీ అదిరింది!

నా కెరీర్‌కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను. నా పాత్ర మాత్రమే కాదు..

 ‘‘నా కెరీర్‌కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను. నా పాత్ర మాత్రమే కాదు.. లావణ్య పాత్ర కూడా చాలా బాగుంటుంది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది’’ అని నాని చెప్పారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 క్రియేషన్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై నాని, లావణ్య త్రిపాఠి జంటగా బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
  మారుతి మాట్లాడుతూ -‘‘రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నాని, లావణ్య త్రిపాఠి మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్, నాని కాంబినేషన్‌లో వ చ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. పాటలు ఓ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘గోపీ సుందర్ చాలా మంచి పాటలు అందించారు. కుటుంబ సమేతంగా అందరూ హాయిగా ఆస్వాదించే సినిమా అవుతుంది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిజార్ షఫీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.
 

Advertisement
 
Advertisement
Advertisement