క్లారిటీ ఇచ్చిన ‘కవచం’ టీం | Bellamkonda Srinivas Kavacham Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Nov 28 2018 1:22 PM | Updated on Aug 3 2019 12:45 PM

Bellamkonda Srinivas Kavacham Release Date Confirmed - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కవచం. సాయి శ్రీనివాస్‌ తొలిసారిగా తొలిసారిగా పోలీస్‌ పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభం కాకపోవటంతో సినిమా వాయిదా పడిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీంతో చిత్రయూనిట్ రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌ విషయంలో ఎలాంటి మార్పు లేదని ముందుగా చెప్పినట్టుగా డిసెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్‌ ముఖేష్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement