బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా డీటెయిల్స్‌ | Bellamkonda and Debutant Srinivas Movie Announcement | Sakshi
Sakshi News home page

Feb 20 2018 4:10 PM | Updated on Feb 20 2018 4:10 PM

Bellamkonda and Debutant Srinivas Movie Announcement - Sakshi

ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో హీరోగా నటిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ బ్యానర్‌లో తొలి ప్రయత్నంగా నవీన్ సొంటినేని (నాని) ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ.. ‘ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో మా బ్యానర్ ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 

‘దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడు గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాగారిని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే మిగతా నటీనటుల మరియు సాంకేతిక నిపుణులను ప్రకటిస్తాం. ఫిబ్రవరి 22న హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement