తప్పులో కాలేసిన బీబీసీ : శశికపూర్‌కు బదులు... | BBC confuses Shashi Kapoor with Rishi Kapoor and Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

తప్పులో కాలేసిన బీబీసీ : శశికపూర్‌కు బదులు...

Dec 5 2017 10:34 AM | Updated on Dec 5 2017 11:31 AM

BBC confuses Shashi Kapoor with Rishi Kapoor and Amitabh Bachchan - Sakshi

బ్రాడ్‌కాస్ట్‌ సర్వీసుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బీబీసీ తప్పులో కాలేసింది. అలనాటి మేటి బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ మృతిచెందిన సందర్భంగా బీబీసీ న్యూస్‌ తప్పుడు వీడియో క్లిప్‌ను షేర్‌చేసింది. శశికపూర్‌ మరణం గురించి మాట్లాడుతూ.. వీడియో క్లిప్‌లో రిషి కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌లను బ్రాడ్‌కాస్ట్‌ చేసింది. దీంతో వెంటనే బీబీసీ న్యూస్‌ ఛానెల్‌పై సోషల్‌ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు.

అనంతరం తప్పును తెలుసుకున్న బీబీసీ-ఎడిటర్‌ పౌల్‌ రోయల్‌, తాము చేసిన అతిపెద్ద తప్పుకు క్షమాపణ చెప్పారు. శశికపూర్‌ మృతి సందర్భంగా షేర్‌ చేసిన వీడియోలో తప్పుడు చిత్రాలను చూపించినందుకు వెర్రీ సారీ అంటూ పౌల్‌ ట్వీట్‌ చేశారు. సాధారణంగా ఇలాంటి తప్పులు జరుగవు, పొరపాటున జరిగినందుకు క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు. బీబీసీ బ్రాడ్‌కాస్ట్‌ చేసిన ఈ వార్తపై మాత్రం ట్విట్టర్‌ యూజర్లు పెద్ద ఎత్తునే విమర్శల వర్షం కురిపించారు.  

Advertisement
 
Advertisement
Advertisement