సైరా దర్శకుడి చేతుల మీదుగా..! | Bangari Balaraju Movie Glitter Launch | Sakshi
Sakshi News home page

సైరా దర్శకుడి చేతుల మీదుగా ‘బంగారి బాలరాజు’..!

Jan 27 2018 10:45 AM | Updated on Jan 27 2018 10:50 AM

Bangari Balaraju Movie Glitter Launch - Sakshi

నంది క్రియేషన్స్ బ్యానర్ పై  కె.ఎం.డి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా ‘బంగారి బాలరాజు’ చిత్రం తో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిట్టర్ ను ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసారు.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... బంగారి బాలరాజు టీజర్ చూసాను. చాలా బాగుంది. కొత్తగా వస్తున్న ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ రఫి గారికి, రాఘవేంద్రరెడ్డి గారికి డైరెక్టర్ కోటేంద్రకి, హీరో రాఘవ్ కు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అంటూ చిత్రయూనిట్‌కి అల్ ద బెస్ట్ చెప్పారు.

చిత్ర నిర్మాతలు కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... సురేందర్ రెడ్డి గారి లాంటి ప్రముఖ దర్శకులు చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఆయన సైరా మూవీ లో బిజీ గా ఉన్నా మాకు టైమ్ కేటాయించి టీజర్ ని విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు.

డైరెక్టర్  కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా బంగారి బాలరాజు మూవీ గ్లిట్టర్ ని పెద్ద మనసుతో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి కొత్త దర్శకులకు సురేందర్ రెడ్డి గారు ఆదర్శంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ ని ఫిబ్రవరి 14 న,  సినిమాని మార్చి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement