గుంటూర్ టాకీస్ చాలా బాగుంటుంది | balakrishna prices guntur talkies | Sakshi
Sakshi News home page

గుంటూర్ టాకీస్ చాలా బాగుంటుంది

Feb 4 2016 11:41 PM | Updated on Aug 29 2018 1:59 PM

గుంటూర్ టాకీస్ చాలా బాగుంటుంది - Sakshi

గుంటూర్ టాకీస్ చాలా బాగుంటుంది

‘కొన్ని పాత్రలు చూసినప్పుడు నేను కూడా ఇన్ స్పైర్ అవుతుంటా.

 ‘‘కొన్ని పాత్రలు చూసినప్పుడు నేను కూడా ఇన్ స్పైర్ అవుతుంటా. నటనలో నేనూ నిత్య విద్యార్థినే. నేను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ జరగడం సంతోషంగా ఉంది. ‘చందమామ కథలు’తో జాతీయ అవార్డందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ చూస్తే, చాలా బాగుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సిద్ధు జొన్నగడ్డ, నరేశ్, రేష్మీ గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, మహేశ్ మంజ్రేకర్ ముఖ్యపాత్రల్లో ఆర్‌కె స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన చిత్రం - ‘గుంటూర్ టాకీస్’. ఈ చిత్రం ట్రైలర్‌ను బాలకృష్ణ  హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘

‘అగ్ర హీరో బాలకృష్ణ గారు మా చిత్రం ట్రైలర్ ఆవిష్కరణకు రావడం మాకు కొత్త బలాన్నిస్తోంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ఏ భాషలో తీసినా ఘన విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న యూనివర్సల్ కథ ఇది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఇది తెరకెక్కింది’’ అని సీనియర్ నరేశ్ తెలిపారు. రేష్మి గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, సిద్ధు జొన్నగడ్డ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ తదితరులు మాట్లాడారు. కెమేరామ్యాన్ రామిరెడ్డి, ఎడిటర్ ధర్మేంద్ర, నటుడు రాజా రవీంద్ర, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement