బాహుబలి 2.. ఆ దేశంలోనూ ఇండస్ట్రీ హిట్..! | Baahubali 2 industry hit Nepal | Sakshi
Sakshi News home page

బాహుబలి 2.. ఆ దేశంలోనూ ఇండస్ట్రీ హిట్..!

May 3 2017 1:49 PM | Updated on Sep 5 2017 10:19 AM

బాహుబలి 2.. ఆ దేశంలోనూ ఇండస్ట్రీ హిట్..!

బాహుబలి 2.. ఆ దేశంలోనూ ఇండస్ట్రీ హిట్..!

బాహుబలి కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నేషనల్ లెవల్లో ఉన్న ఎన్నో రికార్డ్ లను చెరిపేసిన ఈ విజువల్

బాహుబలి కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నేషనల్ లెవల్లో ఉన్న ఎన్నో రికార్డ్ లను చెరిపేసిన ఈ విజువల్ వండర్, ఓవర్ సీస్ లోనూ అదే జోరు చూపిస్తుంది. బాలీవుడ్ టాప్ స్టార్స్కు చెమటలు పట్టిస్తూ తిరిగులేని రికార్డ్లను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్గా పేరు తెచ్చుకున్న బాహుబలి 2, మరో దేశంలోనూ ఇండస్ట్రీ హిట్గా అవతరించనుంది.

భారత్లో సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి పొరుగు దేశమైన నేపాల్లోనూ అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ పది కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలి, అతి త్వరలో నేపాల్లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటి వరకు 17 కోట్లతో 'చక్క పంజా' అనే సినిమా అక్కడ హయ్యస్ట్ గ్రాస్గా ఉంది. మరో వారం రోజుల్లో బాహుబలి 2 ఈ రికార్డ్ను చెరిపేస్తుందని భావిస్తున్నారు. దీంతో భారత్తో పాటు నేపాల్ లోనూ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్గా నిలవనుంది.

Advertisement
 
Advertisement
Advertisement