బాహుబలి 2 ఆడియో రిలీజ్కు భారీ ప్లాన్స్ | Baahubali 2 Audio Release on Ugadi | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 ఆడియో రిలీజ్కు భారీ ప్లాన్స్

Mar 2 2017 10:14 AM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి 2 ఆడియో రిలీజ్కు భారీ ప్లాన్స్ - Sakshi

బాహుబలి 2 ఆడియో రిలీజ్కు భారీ ప్లాన్స్

నేషనల్ లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 సినిమా రిలీజ్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్తో

నేషనల్ లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 సినిమా రిలీజ్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్తో ఆకట్టుకున్న జక్కన్న టీం త్వరలోనే థియట్రికల్ ట్రైలర్ రిలీజ్కు ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో ఆడియో రిలీజ్ను భారీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తతోంది. తొలి భాగం రిలీజ్ సమయంలో ఆడియో విడుదల వేడుకకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో రెండో భాగం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఉగాది రోజున భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న ఈ వేడుకను రామోజీ ఫిలిం సిటీలోనే మాహిష్మతి సెట్ దగ్గర నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కుదరని పక్షంలో ఫిలిం సిటీలోనే మరోప్రాంతంలో ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆడియో విడుదలకు కావాల్సి ఏర్పాట్లు కూడా ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement