‘నా జీవితంలో భయంకరమైన రాత్రి అదే’

Aziz Ansari has been accused of sexually assaulting a woman - Sakshi

భారత సంతతి నటుడిపై బ్రూక్లిన్‌ ఫొటోగ్రాఫర్ ఆరోపణ

న్యూయార్క్‌: భారత సంతతి నటుడు, కమెడియన్‌ అజీజ్ అన్సారీ చిక్కుల్లో పడ్డాడు. 23 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అన్సారీతో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని బ్రూక్లిన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ గ్రేస్‌(ఇది అసలు పేరు కాదు) మీడియాకు వెల్లడించింది. అతడితో జరిగిన చాటింగ్‌ను కూడా ఆమె బయటపెట్టింది. అన్సారీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన జీవితంలో భయంకరమైన రాత్రి గడిపానని ‘బేబ్‌.నెట్’ వెబ్‌సైట్‌తో చెప్పింది.

‘2017 ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో మొదటిసారి అతడితో పరిచయమైంది. తర్వాత ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. సెలబ్రిటీ కావడంతో ఒకసారి అతడితో డేట్‌కు వెళ్లాను. ఆ రాత్రి నాకు పీడకలను మిగిల్చింది. డిన్నర్‌ అయిన తర్వాత ఫ్రాంక్లిన్‌ స్ట్రీట్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వెళ్లిన తర్వాత నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బూతులు మాట్లాడుతూ అసహజ శృంగారానికి ఒత్తిడి తెచ్చాడ’ని వెల్లడించింది.

గ్రేస్‌ చేసిన ఆరోపణలపై అన్సారీ ఇంకా స్పందించలేదు. 34 ఏళ్ల అజీజ్ అన్సారీ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నాడు. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘ద మాస్టర్ ఆఫ్ నన్’  కామెడీ సిరీస్‌లో నటనగానూ అతడికి ఈ అవార్డు వచ్చింది.


గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అజీజ్ అన్సారీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top