‘రూ వంద కోట్ల క్లబ్ చేరువలో బాలా’

ముంబై : ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. శనివారం రూ 6 కోట్లు కలెక్ట్ చేసిన బాలా మొత్తం వసూళ్లు రూ 82.73 కోట్లు రాబట్టగా ఆదివారం రూ 90 కోట్ల మార్క్ దాటి రూ 100 కోట్ల క్లబ్‌కు చేరువవుతుందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత వారం విడుదలైన బాలా పాజిటివ్ రివ్యూలతో క్రమంగా వసూళ్లను కొల్లగొడుతూ నిలకడగా సాగుతోంది. బట్టతల కష్టాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయుష్మాన్ ఖురానా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా, భూమి పెడ్నేకర్, యామి గౌతమ్‌లు సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి