విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?! | Avantika Malik Post Creates Divorce Rumors | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!

Sep 9 2019 3:52 PM | Updated on Sep 9 2019 5:14 PM

Avantika Malik Post Creates Divorce Rumors - Sakshi

బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య అవంతిక మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘కొన్నిసార్లు మనం దూరంగా నడవాల్సి ఉంటుంది. మీ ద్వారా శక్తి పొందే విషయాలను ఓసారి గమనించాలి. వాటితో పాటు ఉండాల్సిన విషయాన్ని గుర్తెరగాలి. దేనికోసమైతే మన సర్వశక్తులను ఒడ్డామో ఆ స్థానంలో ఏర్పడిన ఖాళీ స్థలాన్ని సైతం స్వాగతించగలగాలి. అయినప్పటికీ వెళ్లక తప్పదని నిర్ణయించుకుంటే మన ముందు ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని గుర్తించాలి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 

ఈ క్రమంలో అవంతిక భర్తతో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అవంతిక వేదాంత ధోరణి చూస్తుంటే ఇమ్రాన్‌తో విసిగిపోయినందునే ఇలా నిర్వేదానికి లోనవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇమ్రాన్‌-అవంతిక గతేడాది నుంచి వేరుగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 2011లో వివాహం చేసుకొన్న ఈ జంట 2014లో ఓ పాపకు జన్మనిచ్చింది.

కాగా, ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా 2015లో ‘కట్టి బట్టి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత ఏడాది దర్శకుడిగా అవతారమెత్తి ‘మిషన్ మార్స్: కీప్ వాకింగ్ ఇండియా’  అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి విధిమే. గత కొంత కాలంగా ఇమ్రాన్‌ సినిమాలకు దూరంగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement