దర్శకుడు దొరికాడోచ్‌

Asuran Telugu Remake directed by hanu raghavapudi - Sakshi

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ‘అసురన్‌’ చిత్రం తమిళంలో మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌ నటించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన కలైపులి యస్‌. థానుతో కలసి డి. సురేశ్‌ బాబు తెలుగులో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ ఈ చిత్ర దర్శకుడు ఎవరనే విషయం ప్రకటించలేదు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు దొరికాడని తెలిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచె మనసు’ సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ‘అసురన్‌’ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో శ్రియ  హీరోయిన్‌గా నటించనున్నారట. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ రైతు పాత్రలో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top