విలన్‌గా మారిన మరో హీరో..?

Arya to play Negative role in Rajaratham - Sakshi

కోలీవుడ్‌, మాలీవుడ్‌ యంగ్ హీరోలు టాలీవుడ్ లో ప్రతినాయకులుగా కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆది, ఉన్ని ముకుందన్‌ లాంటి స్టార్‌లు టాలీవుడ్‌ లో మంచి విజయాలు సాధించారు. తాజాగా మరో కోలీవుడ్ నటుడు విలన్‌ రోల్‌ లో కనిపించనున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న రాజరథం సినిమాలో తమిళ నటుడు ఆర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెబుతుండటంతో టాలీవుడ్ లోనూ ఈసినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అనూప్‌ బండారీ దర్శకత్వంలో నిరూప్‌ బండారీ, అవంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రాజరథం. ఈ సినిమాలో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆర్యది విలన్‌ రోల్‌ అని తెలుస్తోంది. మరి నిజంగా ఆర్య నెగెటివ్‌ రోల్‌ లో నటిస్తున్నాడా లేదా తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top