అవును.. లవ్‌లో ఉన్నారు

arun Dhawan Admits Dating Childhood Friend Natasha Dalal On Koffee With Karan - Sakshi

జంటగా పార్టీలకు, ఫంక్షన్‌లకు వెళుతున్నారు కానీ తమ మధ్య ఉన్నది ప్రేమ అని మాత్రం ఇన్నాళ్లు బయటకు చెప్పలేదు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌. ‘కాఫీ విత్‌ కరణ్‌’ అనే షోలో భాగంగా నటాషాను లవ్‌ చేస్తున్నట్లు వరుణ్‌ ఒప్పుకున్నారు. ‘‘నటాషాతో నేను డేటింగ్‌లో ఉన్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నటాషా సాధారణమైన అమ్మాయి. ఆమె గురించిన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు.

ఆమె బాధపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే’’ అని చెప్పుకొచ్చారు వరుణ్‌. ఈ ఏడాది 31వ∙వసంతంలోకి అడుగు పెట్టిన వరుణ్‌ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ఊహించవచ్చు. ప్రస్తుతం అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్‌ మూవీ ‘కళంక్‌’ సినిమాతో బిజీగా ఉన్నారాయన. సంజయ్‌దత్, మాధురీ దిక్షీత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top