హీరో ఎవరో? | Arjun Reddy Star Vijay Devarakonda to make Tamil debut | Sakshi
Sakshi News home page

హీరో ఎవరో?

Dec 23 2017 12:39 AM | Updated on Dec 23 2017 9:52 AM

Arjun Reddy Star Vijay Devarakonda to make Tamil debut  - Sakshi

‘యముడు, సింగం 3’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్‌ సంస్థ తమ తదుపరి సినిమాను ఎనౌన్స్‌ చేసింది. ‘ఇంకొక్కడు’ సినిమాతో దర్శకునిగా పరిచయం అయిన ఆనంద్‌ శంకర్‌  దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరంటూ ? ఒక చిన్న పజిల్‌ను అభిమానులకు వదిలేశారు. ‘గెస్‌ చేస్తూ ఉండండి’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది స్టూడియో గ్రీన్‌ సంస్థ. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. మధ్యలో ఉన్నది హీరో. ఆ హీరో ఎవరు? అనే సస్పెన్స్‌కి కొన్ని గంటల్లో ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. అయితే ఎక్కువ ప్రచారంలో ఉన్న పేరు విజయ్‌ దేవరకొండ. ఈ మధ్య ఆనంద్‌ శంకర్‌ చెప్పిన కథ విజయ్‌ దేవరకొండకు నచ్చిందనే వార్త షికారు చేస్తోంది. సో.. ఈ చిత్రంలో నటించబోయేది విజయ్‌ దేవరకొండ అని ఫిక్స్‌ అవుదామా?

Advertisement
 
Advertisement
Advertisement