లేడీ సూపర్‌స్టార్‌... వాట్‌ ఏ చేంజ్‌ అమ్మా | Sakshi
Sakshi News home page

లేడీ సూపర్‌స్టార్‌... వాట్‌ ఏ చేంజ్‌ అమ్మా

Published Sun, Nov 12 2017 12:22 AM

`Aramm` gets positive reviews, Nayanthara starts theater visit  - Sakshi

ఇటీవల కాలంలో నయనతారను ఎప్పుడైనా ఆడియో వేడుకల్లో గానీ... పోనీ, వీడియో ఇంటర్వ్యూల్లో గానీ చూశారా? అంతెందుకు... ‘నయనతార నటన సూపరో సూపర్‌’ అని ప్రతి ఒక్కరూ ప్రశంసించిన టైమ్‌లో ఈ బ్యూటీ థ్యాంక్స్‌ చెప్పడం చూశారా? లేదు కదూ! పబ్లిసిటీకి నయనతార ఎప్పుడూ కొంచెం దూరమే. అటువంటి నయనతారలో ఎంత మార్పు.. ఎంత మార్పు! ఏకంగా థియేటర్ల దగ్గరకు వెళ్తున్నారు. ప్రేక్షకుల్ని నేరుగా కలసి థ్యాంక్స్‌ చెబుతున్నారు. అసలు మేటర్‌ ఏంటంటే... రీసెంట్‌గా నయనతార ముఖ్య పాత్రలో నటించిన తమిళ్‌ సిన్మా ‘ఆరమ్‌’ విడుదలైంది.

మింజూర్‌ గోపీ (గోపీ నైనర్‌) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజల సమస్యల తరఫున పోరాటం చేసే కలెక్టర్‌గా చేశారామె. నయనతార నటనకు సూపర్బ్‌ రెస్పాన్స్‌. అంతేనా... ‘లేడీ సూపర్‌స్టార్‌’గా పిలుస్తున్నారక్కడ. పబ్లిక్‌ రెస్పాన్స్‌కి ఫుల్‌ ఫిదా అయిన నయన్, అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నారు. థియేటర్స్‌ టూర్‌ వేశారు. ఆమెలో ఈ మార్పు ప్రేక్షకులకు ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. ఇదే విధంగా తెలుగు ప్రేక్షకుల ముందుకూ నయనతార వస్తారా? వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

తప్పక చదవండి

Advertisement