99 పాటలు! | AR Rahman plunges into film production with 99 Songs | Sakshi
Sakshi News home page

99 పాటలు!

Mar 10 2016 11:05 PM | Updated on Aug 20 2018 3:40 PM

99 పాటలు! - Sakshi

99 పాటలు!

సంగీత దర్శకునిగా తన ప్రతిభ ఏంటో జంట ఆస్కార్ అవార్డులు సాధించడం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ఎ.ఆర్. రెహమాన్.........

సంగీత దర్శకునిగా తన ప్రతిభ ఏంటో జంట ఆస్కార్ అవార్డులు సాధించడం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ఎ.ఆర్. రెహమాన్ ఇటీవల నిర్మాతగా మారారు. వైఎం మూవీస్ పతాకంపై ఆయన ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారనే వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమే. ‘99 సాంగ్స్’ పేరుతో ఆయన ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గురువారం రెహమాన్ విడుదల చేశారు. పలు టీవీ డాక్యుమెంటరీ సిరీస్‌లకు దర్శకునిగా వ్యవహరించిన విశ్వేష్ కృష్ణ మూర్తి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మొత్తం పది పాటలుంటాయి. ఇప్పటికే రెహమాన్ ఐదు పాట లకు స్వరాలు సమకూర్చేశారు. కథ కూడా ఆయనే రాశారని సమాచారం.

ఇక.. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. గాల్లో ఎగురుతున్న పియానోని ఓ అబ్బాయి పట్టుకుంటే, అతని చేతిని పట్టుకుని మరో అమ్మాయి వేలాడే ఈ దృశ్యం చాలా పొయిటిక్‌గా ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే.. సంగీత ప్రపంచంలో ఏదో సాధించాలనే ఆశయం ఉన్న గాయనీ గాయకుల జీవితం చుట్టూ  ఈ చిత్రం తిరుగుతుందనిపిస్తోంది. ప్రధానంగా ఓ గాయకుని జీవితంతో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తారాగణం వివరాలేవీ రెహమాన్ పేర్కొనలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement