ఏనుగు కోసం... | Appu Children's film | Sakshi
Sakshi News home page

ఏనుగు కోసం...

Jan 22 2015 11:22 PM | Updated on Sep 2 2017 8:05 PM

ఏనుగు కోసం...

ఏనుగు కోసం...

నగరజీవితంలో అంతా బిజీ. పిల్లల చిన్న చిన్న కోరికలను కూడా తీర్చే తీరిక ఈ రోజుల్లో తల్లిదండ్రులకు లేకుండా పోతోంది.

 నగరజీవితంలో అంతా బిజీ. పిల్లల చిన్న చిన్న కోరికలను కూడా తీర్చే తీరిక ఈ రోజుల్లో తల్లిదండ్రులకు లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎనిమిదేళ్ల అప్పూకి ఏనుగును చూడాలనిపించింది. అమ్మా, నాన్నలను అడిగాడు.. కానీ కోరిక నెరవేరలేదు. అప్పుడు తన కోరికను తీర్చుకోవడానికి స్నేహితులతో ఎలాంటి సాహసానికి  పూనుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన  చిత్రం ‘అప్పూ’. టైటిల్ రోల్‌ను  మాస్టర్ సాయి శ్రీవంత్ పోషిస్తున్నాడు. ఉపశీర్షిక ‘ది క్రేజీ బాయ్’. మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో  కె. మోహన్  నిర్మిస్తున్నారు.
 
  ఈ చిత్రవిశేషాలను మోహన్ తెలియజేస్తూ -‘‘కె.రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. మంచి చిత్రం చేయాలన్న ఆకాంక్షతో ‘అప్పూ’ చేస్తున్నాను. బాలల చిత్రమే అయినప్పటికీ వాణిజ్య హంగులు కూడా ఉంటాయి.  ఓ కీలక పాత్రను ఒక ప్రముఖ  నటి చేయనున్నారు.  ఇందులో ఉన్న నాలుగు పాటలకు శ్రీ అద్భుతమైన స్వరాలందించారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. లోహిత్, కావ్య, బండ జ్యోతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాల తారలు సాయి అభిషేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ.
 

Advertisement
 
Advertisement
Advertisement