మరోసారి నవ్వుల పాలైన అనుష్క | Anushka Sharma Promotes Google Pixel On Twitter Using iPhone | Sakshi
Sakshi News home page

మరోసారి నవ్వుల పాలైన అనుష్క

Sep 5 2018 3:34 PM | Updated on Sep 5 2018 4:07 PM

Anushka Sharma Promotes Google Pixel On Twitter Using iPhone - Sakshi

ట్విటర్‌లో బుక్కైన అనుష్క శర్మ (ఫైల్‌ ఫోటో)

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అవుతూ ఉన్నారు. తన అప్‌కమింగ్‌ సినిమా ‘సూయి ధాగా-మేడిన్‌ ఇండియా’ ట్రైలర్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లకు విపరీతంగా నవ్వు తెప్పించాయి. తాజాగా మరోసారి అనుష్క నెటిజన్ల బారిన పడ్డారు. ఐఫోన్‌ను వాడుతూ.. గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ట్విటర్‌లో ప్రమోట్‌ చేశారు. ప్రపంచంలో టెక్‌ బ్లాగర్స్‌లో ఒకరైన, యూట్యూబ్‌ సెన్సేషన్‌ మార్క్స్‌ బ్రౌన్లీ ఈ విషయాన్ని గుర్తించారు. ఇంకేముంది ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. దీంతో అనుష్క మరోసారి ట్విటర్‌లో బుక్‌ అయిపోయారు. 

సూయి ధాగా నటి అనుష్క శర్మ, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్‌ చేయడానికి, ఐఫోన్‌ను వాడుతూ ట్వీట్‌ చేశారని తెలిపారు. ఆమె ట్వీట్‌ను కూడా స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేశారు. పొరపాటు జరిగినట్టు గుర్తించిన అనుష్క, ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి, మరోసారి షేర్‌ చేశారు. కానీ ఆ లోపే మార్క్స్‌ అనుష్క పొరపాటును గుర్తించేశారు. అనుష్క చేసిన ఈ పొరపాటుపై ఈ యూట్యూబ్‌ స్టార్‌ మరోసారి మరో ట్వీట్‌ చేశారు. ‘డిలీట్‌‌ చేశావ్‌, మళ్లీ రీట్వీట్‌ చేశావు. కానీ కొంచెం కిందకి స్క్రోల్‌ డౌన్‌ చేయండి. ఐఫోన్‌ నుంచి వచ్చిన మరిన్ని పిక్సెల్‌ యాడ్స్‌ కనిపిస్తాయి’ అని పేర్కొన్నారు. అనుష్క చేసిన ఈ పనికి ట్విటర్‌ యూజర్లు పలువురు ఛలోక్తులు పేలుతున్నారు. కొంతమంది ట్విటర్‌ యూజర్లు మాత్రం మార్క్స్‌ను హెచ్చరిస్తున్నారు. మీరు బ్లాక్‌ అవుతారేమో చూసుకోండంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఒకవేళ ఫోటోను పిక్సెల్‌ ఫోన్‌ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని, ఐఫోన్‌ నుంచి పోస్టు చేశారేమో అంటూ కొంతమంది అనుష్కను వెనకేసుకొస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement