రెజ్లింగ్ రింగ్లో అనుష్క పోరాటాలు | Anushka Sharma learns wrestling for 'Sultan' | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్ రింగ్లో అనుష్క పోరాటాలు

Feb 11 2016 3:23 PM | Updated on Sep 3 2017 5:26 PM

రెజ్లింగ్ రింగ్లో అనుష్క పోరాటాలు

రెజ్లింగ్ రింగ్లో అనుష్క పోరాటాలు

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ.. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా బాటలో పయనిస్తోంది.

ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ.. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా బాటలో పయనిస్తోంది. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన 'మేరీ కోమ్' చిత్రం కోసం ప్రియాంక చోప్రా బాక్సింగ్ నేర్చుకోగా.. తాజాగా సుల్తాన్ చిత్రం కోసం అనుష్క రెజ్లింగ్ నేర్చుకుంటోంది.

అనుష్క షార్ట్, బ్లూ షర్ట్ వేసుకుని రింగ్లో రెజ్లింగ్ నేర్చుకుంటున్నప్పటి ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఎలాంటి నొప్పి లేదు, లాభం లేదు.. కేవలం ట్రైనింగ్ తీసుకుంటున్నా అంటూ ట్వీట్ చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రెజ్లర్గా నటిస్తున్నాడు. సల్మాన్ ఈ పాత్ర కోసం బరువు పెరిగాడు. ఈ చిత్రంలో సల్మాన్, అనుష్క శర్మతో పాటు రణ్దీప్ హుడా, అమిత్ సాద్ తదితరులు నటిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement