మరోసారి కత్తి దూస్తున్న స్వీటీ 

Anushka To Play Rani Of Jhansi In Sye Raa Movie - Sakshi

చెన్నై : దక్షిణాది సినిమాలో కత్తి చేత పట్టాలన్నా, గుర్రపుస్వారీ చేయాలన్నా అగ్‌మార్క్‌ ముద్రవేసుకున్న నటి అనుష్కనే అని చెప్పవచ్చు. అలా వీరనారి పాత్రకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ అరుంధతి, రుద్రమదేవి చిత్రాల్లో ఆ తరహా పాత్రల్లో తనకే సాధ్యం అనిపించేలా అభినయించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకుంది. భాగమతి చిత్రం తరువాత చిన్న గ్యాప్‌ తీసుకుని సైలెన్స్‌ అనే చిత్రంతో కొత్తందాలను సంతరించుకుని రానున్న అనుష్క, బహుభాషా చిత్రంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రలో మెరవనుందనే ప్రచారం ఇటీవల దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే.

చిరంజీవి, నయనతార, తమన్నా, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్‌ నటుడు విజయ్‌సేతుపతి, కన్నడ స్టార్‌ నటుడు సుధీప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా సైరాలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసినా, ఆమె పాత్ర ఏమిటన్నది ఇప్పటి వరకూ సస్పెన్స్‌గానే ఉంది. అయితే తాజాగా ఆ పాత్ర రివీల్‌ అయ్యింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో వీరవనిత అనుష్క ఝాన్సీరాణి లక్ష్మీబాయ్‌గా మెరవనుందని తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో వీరవనితగా అనుష్క మరోసారి కత్తి చేత పట్టి వీరవిహారం చేయబోతోందన్న మాట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇందులో ఝూన్సీరాణిగా నటించిన అనుష్క తన పాత్రకు తెలుగు వెర్షన్‌కు తానే డబ్బింగ్‌ కూడా చెప్పుకుందట. ఇలా నయనతార, అనుష్క, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్ల ఒకే చిత్రంలో నటించడంతో సైరా నరసింహారెడ్డి చిత్రంపై చిత్ర పరిశ్రమలోనే కాకుండా, ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది ఉప్పలవాడ నరసింహారెడ్డి అనే స్వాతంత్ర సమరయోధుడి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో టైటిల్‌ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు రామ్‌చరణ్‌ అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top