ప్రభాస్‌తో ఐదోసారి.. | Anushka is the hero in Soho's film. | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో ఐదోసారి..

Jul 7 2017 1:38 AM | Updated on Sep 5 2017 3:22 PM

ప్రభాస్‌తో ఐదోసారి..

ప్రభాస్‌తో ఐదోసారి..

సాహో చిత్రంలో నాయకి అనుష్కనేనా? అవుననే అంటున్నారు సినీవర్గాలు.

తమిళసినిమా: సాహో చిత్రంలో నాయకి అనుష్కనేనా? అవుననే అంటున్నారు సినీవర్గాలు. బాహుబలి–2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనల జంటను మనదేశమే కాదు ప్రపంచదేశాల ప్రేక్షకులు తెగ మెచ్చేశారు. అంతగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రభాస్, అనుష్కల జంట అంతకు ముందే బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించి హిట్‌ పెయిర్‌గా నిలిచారు.

బాహుబలి–2తో ఈ జంట మళ్లీ కలిసి నటిస్తే బాగుండు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి–2 చిత్రం తరువాత ప్రభాస్‌ సాహో అనే త్రిభాషా(తమిళం, తెలుగు, హిందీ) చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలోనూ ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని భావించిన వారు లేకపోలేదు. అయితే సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రంలో వేరే హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది.

బాలీవుడ్‌ బ్యూటీస్‌ సోనంకపూర్, అలియాభట్, పూజాహెగ్డేలతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ చిత్రంలో అనుష్కకు అవకాశం లేదేమో అనుకున్న వారికి శుభవార్త సాహో చిత్రంలో అనుష్కనే నాయకి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ప్రభాస్, అనుష్క జంట ఐదోసారి జత కట్టనున్నారన్నమాట. మరి ఈ జంట మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా అన్నది వేసి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement