పులికి భయపడి వచ్చేశా! | Anjana lost and found | Sakshi
Sakshi News home page

పులికి భయపడి వచ్చేశా!

Apr 27 2016 2:34 AM | Updated on Apr 3 2019 9:04 PM

పులికి భయపడి వచ్చేశా! - Sakshi

పులికి భయపడి వచ్చేశా!

షూటింగ్ సమయంలో పులిని చూసి భయపడి హీరోయిన్ అంజనారాజ్ అదృశ్యమైనట్లు దర్శకుడు పావన్నన్ తెలిపారు. ఆయన కథ, దర్శకత్వం

టీనగర్: షూటింగ్ సమయంలో పులిని చూసి భయపడి హీరోయిన్ అంజనారాజ్ అదృశ్యమైనట్లు దర్శకుడు పావన్నన్ తెలిపారు. ఆయన కథ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘సొల్’. ఆయన మాట్లాడుతూ స్త్రీ, పురుషుడు స్నేహంగా మెలిగితే ప్రేమ ఏర్పడుతుందనే విషయం ఇంతవరకు సినిమాలో చెప్పబడిందని, అయితే ఇరువురూ కలిసి తిరిగితే ప్రేమ రాదనేది ఈ కథ ముఖ్యాంశమన్నారు.
 
  కడలూరు అటవీ ప్రాంతంలో చిత్రం షూటింగ్ జరిగిందని, ఇందులో హీరోయిన్‌గా అంజనారాజ్ నటించారన్నారు. షూటింగ్ సమయంలో పులి చంపడంతో ఒక మహిళ మృతిచెందిందనే వార్త తెలిసిందని,  అయినప్పటికీ షూటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ లోపున హీరోయిన్ కోసం వెదికి చూడగా ఆమె కనిపించలేదని, దీంతో ఎంతో భీతి చెందామన్నారు.
 
  ఆమె ఇంటికి ఫోన్ చేయగా ఆమె ఇంట్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె పులి గురించిన సమాచారం వినగానే ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిందని, ఈ చిత్రం ముగించేలోపున తాను పలువురి వద్ద మాటలు పడ్డానని, దీంతో ఈ చిత్రానికి సొల్ (మాట) అనే పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మోహనరామన్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారని, విజయా సమర్పణలో చరణ్‌కృష్ణ పిక్చర్స్ సహనిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిత్రానికి గజేంద్రన్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement