అంజలిని తొలగించలేదు | Anjali's confirmed for Jayam Ravi film | Sakshi
Sakshi News home page

అంజలిని తొలగించలేదు

Jun 20 2014 12:07 AM | Updated on Sep 2 2017 9:04 AM

అంజలిని తొలగించలేదు

అంజలిని తొలగించలేదు

తమ చిత్రం నుంచి నటి అంజలిని తొలగించలేదని దర్శకుడు సూరజ్ వెల్లడించారు. జయం రవి హీరోగా ఈయన దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. లక్ష్మీ మూవీ మేకర్స్

 తమ చిత్రం నుంచి నటి అంజలిని తొలగించలేదని దర్శకుడు సూరజ్ వెల్లడించారు. జయం రవి హీరోగా ఈయన దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు కథా నాయికల్లో ఒకరిగా నటి అంజలిని ఎంపిక చేశారు. అంజలి తన పిన తల్లితో మనస్పర్థల కారణంగా గత ఏడాది మార్చిలో అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా తన పిన్ని, దర్శకుడు కలైంజయం వలన తనకు ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు కూడా చేశారు. అయితే కలైంజయం చిత్రం ఊరు చుట్టి పురాణం చిత్రంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ చిత్రాన్ని పూర్తి చేయలేదు.
 
 ఇలాంటి పరిస్థితిలో అంజలి మళ్లీ కోలీవుడ్‌లో నటించడానికి సిద్ధం అవడంతో దర్శకుడు కలైంజయం ఆమె రీ ఎంట్రీని అడ్డుకుంటానని ప్రకటించారు. తన చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అంజలి ఇతర తమిళ చిత్రాల్లో నటించాలని ఆయన పట్టుబడుతున్నారు. ఈ విషయమై కలైంజయం ఇప్పటికే దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో జయంరవి సరసన నటించే చిత్రం నుంచి అంజలిని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి స్పందించిన ఆ చిత్ర దర్శకుడు సూరజ్ తమ చిత్రం నుంచి అంజలిని తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అంజలినే తమ చిత్ర హీరోయిన్ అని సూరజ్ స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement