ఇళయరాజా సంగీతంతో అంజలి పాప | Anjali in Ilayaraja music | Sakshi
Sakshi News home page

ఇళయరాజా సంగీతంతో అంజలి పాప

Aug 20 2016 2:05 AM | Updated on Sep 4 2017 9:58 AM

ఇళయరాజా సంగీతంతో అంజలి పాప

ఇళయరాజా సంగీతంతో అంజలి పాప

ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో అంజలి పాప అనే చిత్రం తెరకెక్కుతోంది. సినిమాకు సంగీతానికి ఎంత అనుబంధమో చిన్న సినిమాలకు

ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో అంజలి పాప అనే చిత్రం తెరకెక్కుతోంది. సినిమాకు సంగీతానికి ఎంత అనుబంధమో చిన్న సినిమాలకు ఇళయరాజా సంగీతం అంత బలం. అందుకే చిన్న చిత్రాల నిర్మాతలు, నవ దర్శకులకు ముందు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేది ఆ సంగీత మ్యాస్ట్రోనే. ఆయన కూడా చిన్న, పెద్ద అని చూడకుండా కథ తనను హత్తుకుంటే వెంటనే సంగీతం అందించడానికి సిద్ధం అంటారు. అలా ఇళయరాజా కథ వినగానే తాను బాణీలు కడతాను అని చెప్పిన చిత్రం అంజలి పాప. విశేషం ఏమిటంటే అందరూ కొత్తవారు రూపొందిస్తున్న చిత్రం ఇది.
 
 రైనా ప్రొడక్షన్స్ పతాకంపై శిల్పా నాయక్ కథను అందించి, నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు అజయ్ నోయల్ కథనం, దర్శకత్వం బాధ్యతలతో పాటు కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి సన్నది కేహెచ్.నాయకిగా పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆకాశ్‌భట్, విశాఖ వందన, యోగానంద్, షరోన్‌నివేదా నటిస్తున్నారు. టైటిల్ పాత్రలో బెంగళూర్‌కు చెందిన విపుల అనే మూడేళ్ల చిన్నారి నటిస్తున్నారు.
 
 ఆ చిత్రం షూటింగ్ శుక్రవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. చిత్రం గురించి దర్శకుడు, కథానాయకుడు అజయ్‌నోయల్ తెలుపుతూ ఇది మూడేళ్ల చిన్నారి ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర కథను వినగానే సంగీత జ్ఞాని ఇళయరాజా చాలా బాగుందని అభినందించడంతో పాటు వెంటనే సంగీతాన్ని అందిస్తానని చెప్పారని అన్నారు. దర్శకుడు చాలా ఎనర్జిటిక్ అని ఆయన దర్శకత్వంలో చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత శిల్పానాయక్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement