నానీని టెన్షన్ పెడుతున్న అనిరుధ్‌! | Anirudh Troubling Nanis Gang Leader Movie Team | Sakshi
Sakshi News home page

నానీని టెన్షన్ పెడుతున్న అనిరుధ్‌!

Jun 19 2019 3:22 PM | Updated on Jun 19 2019 3:35 PM

Anirudh Troubling Nanis Gang Leader Movie Team - Sakshi

తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘అ ఆ’ సినిమాతోనే అనిరుధ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాలని భావించినా వర్క్‌ అవుట్ కాకపోవటంతో అజ్ఞాతవాసితో అడుగుపెట్టాడు. అయితే తొలి సినిమా నుంచే టైంకు ట్యూన్‌ ఇవ్వడన్న అపవాదు అనిరుధ్ మీద ఉంది. దీనికి తోడు అజ్ఞాతవాసి డిజాస్టర్ కావటంతో టాలీవుడ్‌లో అనిరుధ్‌ ఆశలు గల్లంతయ్యాయి.

తరువాత చేసిన జెర్సీ హిట్ అయినా అనిరుధ్‌ కు ప్రత్యేకంగా గుర్తింపేమీ రాలేదు. అయితే ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు అనిరుధ్‌. ఈ సినిమా విషయంలోనూ చెప్పిన టైంకు ట్యూన్స్‌ ఇవ్వకుండా చిత్రయూనిట్‌ను ఇబ్బంది పెడుతున్నాడట. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసిన టీం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో అన్న టెన్షన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement