ఎన్టీఆర్ సినిమాకు కూడా అతడే..! | Anirudh Ravichander Music for Ntr trivikram Film | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమాకు కూడా అతడే..!

Oct 17 2017 12:01 PM | Updated on Oct 17 2017 12:01 PM

Ntr Anirudh

అధికారిక ప్రకటన లేకపోయినా.. ఎన్టీఆర్ చేయబోయే తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే అని దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. చాలా కాలంగా ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ ను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. తాజాగా సంగీత దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతమందిస్తున్న అనిరుధ్, ఎన్టీఆర్ సినిమాకు కూడా పనిచేయనున్నాడట. జై లవ కుశ రిలీజ్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న తారక్, మార్చిలో త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement