హీరోయిన్‌గా మరో ఛాన్స్‌ కొట్టేసిన యాంకర్‌ | Anchor Srimukhi as Heroine | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా మరో ఛాన్స్‌ కొట్టేసిన యాంకర్‌

Nov 4 2017 4:39 PM | Updated on Jul 25 2019 6:37 PM

Anchor Srimukhi as Heroine - Sakshi

బుల్లితెర మీద సత్తా చాటుతున్న యాంకర్స్‌ వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి వారు వరుస అవకాశాలతో దూసుకుపోతుండగా మరికొందరు సత్తా చాటేందుకు కష్టపడుతున్నారు. అదే బాటలో బుల్లితెర స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి వరుస అవకాశాలతో సత్తా చాటుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పీరియాడిక్‌ కామెడీ డ్రామా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ఈ సినిమాలో లీడ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్న శ్రీముఖి హీరోయిన్‌ గా మరో ఛాన్స్‌ కొట్టేసింది.

వి.ఎస్‌ వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో శ్రీముఖి హీరోయిన్‌గా నటిస్తోంది. ‘కుటుంబ కథా చిత్రం’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందు హీరోగా నటిస్తున్నాడు. కొత్తగా పెళ్లైన జంట నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోయిన్‌ గా ప్రూవ్‌చేసుకోవాలని భావిస్తోంది శ్రీముఖి.

Advertisement
 
Advertisement
Advertisement