పవన్ను కాదని.. సాయి ధరమ్తో..! | Anasuya Item song in Sai dharam tej winner | Sakshi
Sakshi News home page

పవన్ను కాదని.. సాయి ధరమ్తో..!

Oct 26 2016 10:40 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ను కాదని.. సాయి ధరమ్తో..! - Sakshi

పవన్ను కాదని.. సాయి ధరమ్తో..!

బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన అందాల భామ అనసూయ ఇప్పుడు వెండితెర మీద సత్తాచాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటి లీడ్ రోల్స్ కోసం ఎదురుచూస్తోంది. సొగ్గాడే చిన్ని నాయన...

బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన అందాల భామ అనసూయ ఇప్పుడు వెండితెర మీద సత్తాచాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటి లీడ్ రోల్స్ కోసం ఎదురుచూస్తోంది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా, క్షణం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన ఈ బ్యూటి ఇప్పుడు మరో కొత్త అవతారం కనిపించేందుకు రెడీ అవుతోంది.

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించని ఈ భామ.., ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ఆడి పాడేందుకు రెడీ అవుతుంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్కు అనసూయ ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అనసూయ స్పెషల్ సాంగ్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement