రివర్స్‌ కాన్సెప్ట్‌తో థ్రిల్‌! | Anandoobrahma movie was released on 18th of this month | Sakshi
Sakshi News home page

రివర్స్‌ కాన్సెప్ట్‌తో థ్రిల్‌!

Aug 14 2017 12:46 AM | Updated on Aug 13 2018 3:04 PM

రివర్స్‌ కాన్సెప్ట్‌తో థ్రిల్‌! - Sakshi

రివర్స్‌ కాన్సెప్ట్‌తో థ్రిల్‌!

‘‘పాఠశాల’ తర్వాత మరో మంచి సినిమా చేయాలని గ్యాప్‌ తీసుకున్నా.

‘‘పాఠశాల’ తర్వాత  మరో మంచి సినిమా చేయాలని గ్యాప్‌ తీసుకున్నా. కథ రాయడానికి, ఆర్టిస్టుల డేట్స్‌ కుదరడానికీ సమయం పట్టింది’’ అన్నారు దర్శకుడు మహి వి. రాఘవ్‌. తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్‌ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘ఆనందోబ్రహ్మ’ ఈ నెల 18న విడుదలవుతోంది. మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ – ‘‘నేను దేవుణ్ణి, దెయ్యాన్ని నమ్మను.

దానికి కారణం భయమే. హారర్‌ థీమ్‌నే రివర్స్‌లో చెప్పి, థ్రిల్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడే మనిషికి దెయ్యం భయపడితే ఎలా ఉంటుంది? అని కథ రాసుకున్నా. కథ విని, చేయడానికి తాప్సీ సిద్ధమైంది. ఆమె డేట్స్‌ కోసం నాలుగు నెలలు వెయిట్‌ చేశా. సినిమా బాగా రావడానికి నిర్మాత విజయ్‌గారు కూడా ఓ కారణం. హారర్‌ సినిమాల్లో సౌండ్‌ చాలా కీలకం. అందుకే మేము సౌండ్‌ కొత్తగా ఉండాలని చాలా సమయం తీసుకున్నాం. ప్రస్తుతానికి ఏ సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమా రిజల్ట్‌ కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement