‘కాదు.. మీరు నా దొరసాని’ | Anand Devarakonda Dorasani Movie Teaser Released | Sakshi
Sakshi News home page

‘కాదు.. మీరు నా దొరసాని’

Jun 6 2019 9:29 AM | Updated on Jul 7 2019 11:45 AM

Anand Devarakonda Dorasani Movie Teaser Released - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ‘దొరసాని’ అంటూ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పటినుంచీ ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌.

తెలంగాణలోని ఒకప్పటి గడీల కాలంలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌లో.. మీ పేరు అని శివాత్మిక అని అడిగితే ‘రాజు’ అని చెప్పి.. ‘మీరు దొరసాని’ అని మన హీరో అనడం.. వెంటనే శివాత్మిక ‘కాదు దేవికా’ అని అనడం.. వెంటనే ‘కాదు మీరు నా దొరసాని’ అని ఆనంద్‌ ఆనడం ఆకట్టుకుంది. ఆనంద్‌ డైలాగ్‌ డెలివరీలో కూడా విజయ్‌ మాడ్యులేషన్‌ కనబడటం ప్లస్‌ అయ్యేలా కనిపిస్తోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతాన్ని అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement