మాస్క్‌ను హిందీలో ఏమంటారో తెలుసా | Amitabh Bachchan Shares What A Mask Is Called In Hindi | Sakshi
Sakshi News home page

మాస్క్‌ను హిందీలోకి అనువదించిన బిగ్‌ బీ

Jun 24 2020 4:06 PM | Updated on Jun 24 2020 4:10 PM

Amitabh Bachchan Shares What A Mask Is Called In Hindi - Sakshi

కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ త‌ప్ప‌క ధ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కరోనా బారిన ప‌డ‌కుండా ఉండాలి అంటే మాస్క్ ఒక్క‌టే శ్రీరామ‌ర‌క్ష అని నిపుణులు చెబుతున్నారు. అయితే మాస్క్‌ను హిందీలో ఏమాంటారో మీలో ఎవరికైనా తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌. ఒకవేళ తెలియకపోతే తన ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి తెలుస్తుంది అంటున్నారు. చాలా కష్టపడి మాస్క్‌ను హిందీలోకి అనువదించాను అంటూ గులాబో సితాబో మూవీ మాస్క్‌ ధరించి బిగ్‌ బీ షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలువుతోంది. 
 

‘చాలా శ్రమ పడిన తర్వాత మాస్క్‌ని హిందీలో ఏమంటారో తెలిసింది. దీనికి సరైన అనువాదం.. ‘నాసికాముఖ‌సంర‌క్ష‌క కీటానురోధ‌క‌ వాయుఛాన‌క‌ వ‌స్త్ర‌డోరీయుక్త‌ప‌ట్టీ’’ అనే క్యాప్షన్‌తో అమితాబ్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫోటో నెటిజ‌నులను తెగ ఆక‌ట్టుకుంటుంది. ప్రస్తుతం క‌రోనా వ‌ల‌న థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆయుష్మాన్ ఖురానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కించిన గులాబో సితాబో చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. జూన్ 12న విడుద‌లైన ఈ కామెడీ డ్రామాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement