Amitabh Bachchan said he Received his First National Award with Karunanidhi - Sakshi
Sakshi News home page

‘కరుణానిధి చేతుల మీదుగా నా తొలి అవార్డు’

Aug 8 2018 3:27 PM | Updated on Aug 8 2018 4:31 PM

Amitabh Bachchan Said I Take My First National Award Karunanidhi - Sakshi

కరుణానిధి, తమిళ సిని ప్రముఖులతో పాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌(ఫైల్‌ ఫోటో)

నా తొలి జాతీయ అవార్డును కరుణానిధి చేతుల మీదుగా అందుకున్నాను

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం పట్ల బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ విషాదం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్‌, కరుణానిధితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నా తొలి జాతీయ అవార్డును కరుణానిధి చేతుల మీదుగా అందుకున్నాను’ అంటూ ఉద్వేగపూరితమైన ట్వీట్‌ చేశారు.

‘పూజ్యులు, ధైర్యశాలి అయిన కరుణానిధి చేతుల మీదుగా ‘సాత్‌ హిందుస్తానీ’ చిత్రానికి గాను నేను నా తొలి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాను. ఆ ఏడాది జాతీయ స్థాయి సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చెన్నై (మద్రాస్‌)లో జరిగింది. అప్పుడు కరుణానిధి సీఎంగా ఉన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. అహ్మద్‌ అబ్బాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాత్‌ హిందుస్తానీ’ చిత్రానికి గాను అమితాబ్‌ బచ్చన్‌ ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ న్యూకామర్‌’ కెటగిరిలో అవార్డు అందుకున్నారు.

కాగా మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణానిధి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement