బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్‌.. | amitab will be another two years as ambassador to Unicef | Sakshi
Sakshi News home page

బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్‌..

Jul 24 2017 11:56 AM | Updated on May 28 2018 3:53 PM

బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్‌.. - Sakshi

బిగ్‌బీకే మళ్లీ ఛాన్స్‌..

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు గౌరవ బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. యూనిసెఫ్‌(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి)కి రాయబారిగా అమితాబ్‌ మరో రెండేళ్లు కొనసాగనున్నారు.

ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు గౌరవ బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. యూనిసెఫ్‌(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి)కి రాయబారిగా అమితాబ్‌ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. పిల్లల్లో వచ్చే మీజిల్స్‌, రెబెల్లా వ్యాధుల నివారణపై ఆయన  ఈ రెండేళ్లలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పోలియో, హెపటైటిస్‌ బి, క్షయ వ్యాధుల నివారణకు సంబంధించి పలు ప్రచార కార్యక్రమాల్లో బిగ్‌ బీ పాల్గొంటున్నారు.

పోలియో మహమ్మారిపై చేస్తున్న యుద్దంలో విజయం సాధించినందుకు, పసిపిల్లలకు ఎంఆర్‌ వ్యాక్సినేషన్‌ వేయించేందుకు కృషి చేస్తున్నందుకు తనను యూనిసెఫ్‌ అంబాసిడర్‌గా మరో రెండేళ్లు పొడిగించినట్లు అమితాబ్‌ స్వయంగా ఆదివారం రాత్రి తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. అలాగే, తన సంతోషాన్ని అభిమానులతో తన బ్లాగులో అమితాబ్‌ పంచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement