ఆకతాయితో ఐటమ్ | Amisha Patel re entry with special song in aakatai movie | Sakshi
Sakshi News home page

ఆకతాయితో ఐటమ్

Nov 23 2016 10:50 PM | Updated on Sep 18 2019 2:56 PM

ఆకతాయితో ఐటమ్ - Sakshi

ఆకతాయితో ఐటమ్

తెలుగులో బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించారు హిందీ హీరోయిన్ అమీషా పటేల్.

తెలుగులో బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన  నటించారు హిందీ హీరోయిన్ అమీషా పటేల్. కొంత విరామం తర్వాత ఆమె ఐటమ్ గాళ్‌గా తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఆకాశ్‌రాజ్, రుక్సర్ మీర్ జంటగా రామ్ భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్‌లు నిర్మిసున్న సినిమా ‘ఆకతాయి’. ఇందులో అమీషా పటేల్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ నేతృత్వంలో సారథీ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.

అమీషా పటేల్ మాట్లాడుతూ - ‘‘టైటిల్ సాంగ్ ఇది. ప్రీ-క్లైమాక్స్‌లో ముఖ్యమైన సందర్భంలో వస్తుంది’’ అన్నారు. ‘‘లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. పది రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతల్లో ఒకరైన కౌశల్ కరణ్ చెప్పారు. జానీ మాస్టర్, హీరో ఆకాశ్‌రాజ్, దర్శక-నిర్మాతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement