సూపర్‌స్టార్‌కు ఆమిర్‌ఖాన్ విజ్ఞప్తి | Amirkhan appeal to superstar | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌కు ఆమిర్‌ఖాన్ విజ్ఞప్తి

Dec 10 2016 3:01 AM | Updated on Sep 4 2017 10:18 PM

సూపర్‌స్టార్‌కు ఆమిర్‌ఖాన్ విజ్ఞప్తి

సూపర్‌స్టార్‌కు ఆమిర్‌ఖాన్ విజ్ఞప్తి

సూపర్‌స్టార్‌కు కోలీవుడ్, బాలీవుడ్‌ దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సూపర్‌స్టార్‌కు కోలీవుడ్, బాలీవుడ్‌ దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్‌లో హీరోగా పలు చిత్రాల్లో నటించిన రజనీకాంత్‌కు బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్  నుంచి ఆమిర్‌ఖాన్, షారుక్‌ ఖాన్ అంటూ అందరితోనూ స్నేహసంబంధాలున్నాయి. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్ మన సూపర్‌స్టార్‌ను ఒక కోరిక కోరడం విశేషం. ఆమిర్‌ఖాన్ తాజాగా నటించిన చిత్రం దంగళ్‌. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్, ధనుష్‌ల కుటుంబానికి ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అదే సమయంలో ఆమిర్‌ఖాన్‌ రజనీకాంత్‌ను ఒక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దంగళ్‌ చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు తమిళంలో రజనీకాంత్‌ను డబ్బింగ్‌ చెప్పాల్సిందిగా కోరినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మరి ఆయన కోరికను సూపర్‌స్టార్‌ తీరుస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. దంగళ్‌ చిత్రంలో ఆమిర్‌ఖాన్ పాత్ర యంగ్‌ ఏజ్‌ నుంచి ఓల్డ్‌ ఏజ్‌ వరకూ సాగుతుంది. ఇందులో ఆయన అద్భుతంగా నటించారనే టాక్‌ ఇప్పటికే స్ప్రెడ్‌ అయ్యింది.  క్రిస్మస్‌ పండుగకు ముందు విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement