‘చెడు ఎక్స్‌పెక్ట్‌ చేయకపోవడం పిచ్చితనం’ | Amar Akbar Anthony Trailer Released | Sakshi
Sakshi News home page

‘చెడ్డవాళ్ల నుంచి చెడు ఎక్స్‌పెక్ట్‌ చేయకపోవడం పిచ్చితనం’

Nov 12 2018 3:30 PM | Updated on Nov 12 2018 3:54 PM

Amar Akbar Anthony Trailer Released - Sakshi

మాస్‌ మహరాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. ఈ సినిమా థియరిటికల్‌ ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది మూవీ యూనిట్‌. ‘శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వారు కొందరు ఉంటే శక్తి మేరకు నయవంచన చేసేవారు కోకొల్లలు, చెడ్డవాళ్ల నుంచి చెడు ఎక్స్‌పెక్ట్‌ చేయకపోవడం పిచ్చితనం’ వంటి శ్రీను వైట్ల మార్కు డైలాగ్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అమర్‌ పాత్రలో సీరియస్‌గా కనిపించిన రవితేజ... డాక్టర్‌ ఆంటొనిగా సునీల్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రఘుబాబులతో కలిసి తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఇక హీరోయిన్‌ ఇలియానా క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది.

కాగా లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 16న విడుదల చేయనున్నారు. డైరెక్టర్‌ శ్రీను వైట్ల, హీరోయిన్‌ ఇలియానాకు రవితేజతో ఇది నాలుగో చిత్రం కావడం విశేషం.  శ్రీను వైట్ల- రవితేజ కాంబినేషన్‌లో గతంలో నీకోసం, వెంకీ, దుబాయ్‌ శీను చిత్రాలు రాగా, రవితేజ- ఇలియానా హీరోహీరోయిన్లుగా ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు రూపొం‍దిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement