#మీటూ: ఆయన పరువు నష్టం విలువ రూపాయే!

AlokNath Filed Defamation Seeking A Written Apology And Rs 1 As Compensation. - Sakshi

ముంబై : మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న బాధితులపై పరువునష్టం దావాల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అలోక్‌ నాథ్‌ తనపై లైంగిక ఆరోపణలు చేసిన రచయిత, నిర్మాత వింటా నందాపై పరువు నష్టం దావా వేసారు. ఆమె ఆరోపణలను ‘నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. రేప్ జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు.’ అంటూ చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పిన అలోక్‌ నాథ్‌.. డిఫమేషన్‌ దావాలో కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం అడిగారు. తన పరువుకు భంగం కలిగిందని, దీనికి వింటా నందా రాతపూర్వక క్షమాపణలతో పాటు ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ దావా వేశారు. దీంతో ఇదేం పరువు నష్టం దావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలోక్‌ తప్పతాగి గదిలోకి వచ్చాడు..)

కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చిన విషయం తెలిసిందే.19 ఏళ్ల కిందట అలోక్ నాథ్‌ తనకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించడంతో   ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి  రాజుకుంది. (చదవండి: ‘రేప్‌ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top