సూర్యతో శిరీష్‌

Allu Sirish excited to work on multi-starrer helmed by KV Anand - Sakshi

‘వీడొక్కడే, బ్రదర్స్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలు అందించిన హీరో సూర్య, దర్శకుడు కేవీ ఆనంద్‌ కాంబినేషన్, ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతున్నారు. లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది సూర్యకు 37వ సినిమా. హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ కాబట్టి సినిమాను భారీగానే ప్లాన్‌ చేశారు దర్శకుడు కేవీ ఆనంద్‌. దానికి తగ్గట్టుగానే యాక్టర్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఆల్రెడీ మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ టీమ్‌లో జాయిన్‌ అయిపోయారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి అల్లు శిరీష్‌ కూడా యాడ్‌ అయ్యారు.

ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌గారు చెప్పిన పాత్ర నాకు చాలా నచ్చింది. ఎంతలా నచ్చిందంటే ఇప్పటి నుంచే ఆ  క్యారెక్టర్‌ కోసం ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేశాను. నా ఫేవరెట్‌ యాక్టర్‌ సూర్యతో కలిసి యాక్ట్‌ చేయడం, అది కూడా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ అయ్యేసరికి చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. మలయాళంలో మోహన్‌లాల్‌గారితో ‘1971: బియాండ్‌ బోర్డర్స్‌’ పరిచయం అయ్యాను. ఇప్పుడు మోహన్‌లాల్, సూర్య ఇద్దరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్‌గారికి థ్యాంక్స్‌’’ అని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top