సుల్తాన్గా బన్నీ.. సుల్తానాగా స్నేహారెడ్డి | Allu Arjun & Sneha Reddys Turkey tour details | Sakshi
Sakshi News home page

సుల్తాన్గా బన్నీ.. సుల్తానాగా స్నేహారెడ్డి

Jun 10 2016 2:14 PM | Updated on Sep 4 2017 2:10 AM

సుల్తాన్గా బన్నీ.. సుల్తానాగా స్నేహారెడ్డి

సుల్తాన్గా బన్నీ.. సుల్తానాగా స్నేహారెడ్డి

సరైనోడు సినిమాతో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తున్న అల్లు అర్జున్, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. సరైనోడు సక్సెస్ తరువాత ఇంత వరకు సినిమా అంగీకరించని బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి...

సరైనోడు సినిమాతో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తున్న అల్లు అర్జున్, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. సరైనోడు సక్సెస్ తరువాత ఇంత వరకు సినిమా అంగీకరించని బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే కశ్మీర్ ట్రిప్ ముగించుకొని టర్కీ చేరిన బన్నీ దంపతులు అక్కడి పర్యాటక ప్రదేశాల్లో సందడి చేస్తున్నారు.

ఈ ట్రిప్లో భాగంగా ప్రసిద్ధ బ్లూ మాస్క్యూను సందర్శించిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అక్కడి రాజ కుటుంబీకుల దుస్తులు ధరించి ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన స్నేహ సుల్తాన్, సుల్తానా అంటూ కామెంట్ చేసింది. ఆసక్తికరంగా కనిపిస్తున్న బన్నీ లుక్ ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిక్గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement