ఒక్క ఫ్రేములో బన్నీ సినిమా స్టోరీ | Allu Arjun Shares Photo With Raghavendra Rao And Trivikram Srinivas | Sakshi
Sakshi News home page

ఈ ఒక్క ఫొటో బన్నీ జర్నీకి నిదర్శనం

Feb 5 2020 2:30 PM | Updated on Feb 5 2020 2:56 PM

Allu Arjun Shares Photo With Raghavendra Rao And Trivikram Srinivas - Sakshi

గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్‌.. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో జతకట్టిన బన్నీ ‘ఆర్య’ సినిమాతో మరోసారి ప్రేమకథను ఎంచుకుని సక్సెస్‌ను అందుకున్నాడు. ఆపై సాఫ్ట్‌ యాంగిల్‌ నుంచి మాస్‌, రొమాంటిక్‌, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ తన సత్తా చాటుతూ ఆల్‌రౌండర్‌గా మారాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకునే బన్నీ ఆయా సినిమాలకు తగ్గట్టుగా భిన్న లుక్స్‌తో కనిపించడానికే ప్రాధాన్యం ఇస్తాడు. అలా తక్కువ కాలంలోనే స్టైలిష్‌ స్టార్‌గా పేరు గడించాడు. అయితే ఎవరికైనా తొలి సినిమా ఓ జ్ఞాపకం.. ఓ మధురానుభూతి.. ఎన్ని విజయాలందుకున్నా.. ఎంత ఎదిగినా తొలి అడుగు అక్కడే మొదలైందన్న విషయం ఎవరూ మర్చిపోరు. అలాగే కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న సినిమా కూడా అంతే ప్రత్యేకం. (సామజవరగమన పాటకు కేటీఆర్‌ ఫిదా)

ఈ క్రమంలో తన తొలి సినిమా ‘గంగోత్రి’ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, తాజా సినిమా (అల వైకుంఠపురములో) దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి బన్నీ ఒకే ఫ్రేములో కనిపించాడు. ‘గంగోత్రి నుంచి అల వైకుంఠపురం వరకు ఒక్క ఫ్రేములో నా జర్నీ’ అంటూ బన్నీ ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ మీ శ్రమే మిమ్మల్నీ స్థాయిలో నిలబెట్టింది అని ఆకాశానికెత్తుతున్నారు. కాగా ఈ హీరో తాజా చిత్రం అల వైకుంఠపురములో టాలీవుడ్‌ రికార్డులను బద్దలు కొడుతూ బాక్సాఫీస్‌ను హోరెత్తిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో బన్నీ ఇటీవలే సినిమా దర్శకులందరికీ ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బన్నీ సినిమాలు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘జులాయి’ సినిమాలు సైతం హిట్‌ను సాధించాయి. ప్రస్తుతం బన్నీ, క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నాతో కలిసి సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రంలో నటించనున్నాడు.

చదవండి: టాలీవుడ్‌ దర్శకులకు గ్రాండ్‌పార్టీ ఇచ్చిన బన్నీ

అల్లు అర్జున్‌ టైటిల్‌ అది కాదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement